బిట్ కాయిన్ కు ధీటుగా జియో కాయిన్..అంబానీ భారీ ప్లాన్..!

Sunday, January 14th, 2018, 08:40:07 PM IST

ప్రపంచం మొత్తం ఇప్పుడు బిట్ కాయిన్ పేరు మారుమ్రోగిపోతోంది. వర్చువల్ కరెన్సీ పై అంతా దృష్టి పెడుతుండడంతో ఒక్కొక్కరుగా బిట్ కాయిన్ పై ఆసక్తి చూపుతుండడంతో పెట్టుబడి దారులు దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. కాగా వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ వ్యాపార ఎత్తుగడలు వేయడంలో ముందు ఉంటారు. బిట్ కాయిన్ తరహాలో మరో జియో కాయిన్ ని ప్రవేశపెట్టే యోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కనుక వస్తే అంబానీ సృటించే మరో సంచనలం అవుతుందని బిజినెస్ అనలిస్ట్ లు అంటున్నారు.

కాగా వర్చువల్ కరెన్సీ కి భారత ప్రభుత్వం అనుకూలంగా లేదు. దీనివలన దుర్వినియోగం జరిగే అవకాశం ఉండడంతో భారత్ లో ఇది చట్టబద్దం కాదని రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చేసారు. రిలయన్స్ ఆద్వర్యంలోని జియో ఇన్ఫో కామ్ వర్చువల్ కరెన్సీ పై దృష్టి సారించారు. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ దీనికి నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు బిట్ కాయిన్ మానియా నడుస్తోంది. దీనికి పోటీగా జియో కాయిన్ తీసుకురావాలనేది అంబానీ పథకం. కాగా ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు మోడీ గత ఏడాది కమిటీని నియమించారు. ఆ కమిటీ వివరాలు ఇటీవలే అందాయని సీనియర్ న్యాయ అధికారు తెలిపారు. దీనివలన దుర్వినియోగం ఎక్కువవుతుండనై చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో నల్ల కుభేరులు క్రిప్టో కరెన్సీ వలన తప్పించుకున్న సంగతి తెలిసిందే.