ఆటమధ్యలో.. అర్జెంట్ అంటూ పరుగెత్తిన ఆసీస్ ఓపెనర్..!

Thursday, February 23rd, 2017, 03:29:56 PM IST


గురువారం పుణేలో ఆస్ట్రేలియా, టీం ఇండియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాంటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా స్కోర్ 82 పరుగుల వద్ద అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే బంతికి రెండు వికెట్లు పడ్డాయి.అదెలాగనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళదాం. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. అతడి స్థానంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ కు వచ్చాడు.కానీ అదే సమయంలో మరో ఓపెనర్ రెన్షా పెవిలియన్ వైపు పరుగెత్తాడు. అసలేం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు.

అంపైర్లు అతడిని ఆపి ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఔటైనట్లు ప్రకటించాల్సి వస్తుందని రెన్షా కు తెలిపారు. తన కడుపులో తిప్పుతోందని వాష్ రూమ్ కు వెళ్లాలని రెన్షా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీనితో అంపైర్లు అతడిని రిటైర్డ్ హార్ట్ గా ప్రకటించారు. ఈ విధంగా భారత్ కు ఒకే బంతికి రెండు వికెట్లు దక్కాయి. కానీ రెన్షా వెనుదిరిగిన విధానం మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పాపం అర్జెంట్ అయి వెళ్లిన రెన్షా ని అంపైర్లు ఔటైనట్లు ఎలా ప్రకటిస్తారు. అంపైర్లకు మాత్రం అర్జెంట్ గా వెళ్లాల్సిన అవసరం రాదా అని జోకులు పేలుస్తున్నారు.