మెట్రో స్టేషన్ లలో రెంట్ ఏ బైక్ స్కీం!

Thursday, February 1st, 2018, 11:14:52 AM IST

హైదరాబాద్ లో మెట్రో రైల్ రావాలి అనేది ప్రజల చిరకాల కోరిక. దేశం లోని ప్రధాన నగరాలకు ఏమాత్రం తీసిపోని మన భాగ్యనగరానికి మొత్తానికి ఇన్నాళ్లకు మెట్రో సర్వీసులు వచ్చాయన్న ఆనందం సగటు ప్రయాణికుడిలో ఎక్కువ కాలం నిలువలేదనే చెప్తున్నారు విశ్లేషకులు. నిజానికి అందుకు ముఖ్య కారణం మెట్రో రైల్ లో టికెట్ ల ధరలు, ప్రస్తుతం మెట్రో లో కనీస ధర రూ.10, గరిష్ట ధర రూ.60 గాను వున్న విషయం తెలిసిందే. అయితే రోజువారీ ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులకు ఇది కొంత భారమని, దీని పై ప్రభుత్వం స్పందించి టికెట్ ధరలు కొంత మేర తగ్గించే దిశగా ఆలోచించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మెట్రో స్టేషన్ ల వద్ద నుండి ప్రయాణికులు వారి వారి గమ్య స్థానాలు సులువుగా చేరడానికి రెంట్ ఆ బైక్ స్కీం ను మెట్రోల్ రైల్ యండి యెన్విఎస్ రెడ్డి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ స్కీం ద్వారా మెట్రో స్టేషన్ నుండి ప్రజలు సులువుగా తమ స్థానాలు చేరుకునేందుకు చాలా ఉపయోగకరమని, ఈ బైక్ ల ద్వారా ప్రయాణికుడు కిలోమీటరుకు రూ.4 చొప్పున చెల్లించవలసి ఉంటుందని, పెట్రోల్ విషయం బైక్ రైడర్ చూసుకుంటారని, ప్రస్తుతం 20 బైక్ లతో ఈ స్కీం ను ప్రారంభించామని, త్వరలో దీనిని అన్ని మెట్రో స్టేషన్ ల లో అమలు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే మెట్రో స్టేషన్ ల లో రెంట్ ఏ సైకిల్ స్కీం అమలులో వున్న విషయం తెలిసిందే…