బిగ్‌బాస్ సీజ‌న్-3.. ఇది నిజ‌మేనా రేణు దేశాయ్..?

Tuesday, January 8th, 2019, 02:45:51 PM IST

తెలుగు బుల్లితెర పై బిగ్‌బాస్ ఫ‌స్ట్, సెకండ్ సీజ‌న్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్‌కి తార‌క్ హోస్ట్‌గా చేయ‌గా శివ‌బాలాజీ విజేత‌గా నిలిచారు. అలాగే సెకండ్ సీజన్‌కి నాని హోస్ట్‌గా చేయ‌గా, కౌశ‌ల్ విజేత‌గా నిలిచారు. దీంతో ఇప్పుడు బిగ్‌బాస్ థ‌ర్డ్ సీజ‌న్ కోసం ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు బుల్లితెర ప్రేక్ష‌కులు. ఇక బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్ ఎవరనే విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ చేసే అవకాశం ఉందని, ఎన్టీఆర్ మల్లి రంగంలోకి దిగుతాడని.. విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. ఇదిలా తాజాగా బిగ్ బాస్ 3 హోస్ట్ విషయంలో సీనియర్ స్టార్ హీరో పేరు వైరల్ అవుతోంది.

అయితే ఇప్పుడు హోస్ట్ విష‌యం ప‌క్క‌న పెడితే బిగ్‌బాస్ మూడో సీజన్‌లో సందడి చేయనున్న సెలెబ్రిటీలు వీరేనంటూ పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సీజ‌న్‌లో ప్ర‌ముఖ సినీ నటుడు, జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌తో పాటు టీవీ యాంకర్ ఉదయభాను, నటిమణులు శోభిత ధూళిపాల, గద్దె సింధూర, యూట్యూబ్ స్టార్ జాహ్నవి, హీరో వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, జాకీ, హేమచంద్ర, రఘు మాస్టర్, జబర్దస్త్ పొట్టి నరేశ్ తదితరులు పాల్గొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అంద‌రి విష‌యం ప‌క్క‌న పెడితే రేణుదేశాయ్ ఎంట్రీ పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంది. ఈ వార్త‌లు నిజ‌మే అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వ్యాఖ్యాత (హోస్ట్)గా మెగాస్టార్ చిరంజీవి లేదా విక్టరీ వెంకటేష్‌లలో ఎవరో ఒకరు వ్యవహించవచ్చని సోష‌ల్ మీడియాలో వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి.