పవన్ కళ్యాణ్.. పాపం పసివాడు..!

Wednesday, January 24th, 2018, 11:09:13 PM IST

టి కాంగ్రెస్ లో ఉండే ముఖ్యమంత్రి అభ్యర్థుల గురించి మాట్లాడుకోవాలంటే చాంతాడంతా చీటీ అవుతుంది. ఎన్నికల సమయం వచ్చేసరికి ఆ పార్టీలో అందరూ సీఎం క్యాండిడేట్లే అవుతారు. టి కాంగ్రెస్ లో అగ్రనేతల మధ్య ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో విజయం సాధించేంత పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఆ చర్చ పెద్దది కావడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి కి కూడా ఈ ప్రశ్న ఎదురైంది.

నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని ఆమె బదులిచ్చారు. కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థే అని అన్నారు. ఖమ్మం జిల్లాలో తాను పార్టీకి ముందుండి నడిపిస్తానని అన్నారు. తనని అడ్డుకునేవారు ఎవ్వరూ లేరని అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆమె మాట్లాడారు. జనసేన గురించి మాట్లాడుతూ పవన్ పాపం పసివాడు అని అన్నారు.