జగన్ కు హ్యాండ్ ఇవ్వడానికి గల కారణాలు ఇవే !

Tuesday, October 17th, 2017, 02:50:33 PM IST

2019 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే వైసిపి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి అత్యంత కీలక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీకి దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల ఎన్నికల్లో పరాజయంతో నైరాశ్యంలో ఉన్నవైసీపీకి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక గుడ్ బై చెప్పేశారు. దీనితో పార్టీ జిల్లాలో మరింత కుంగిపోయినట్లయింది. ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.

కాగా టీడీపీకి కండువా కప్పుకున్న అనంతరం జగన్ కు దూరం కావడానికి గల కారణాలని బుట్టా రేణుక వివరించారు. తన నిర్ణయం వెనుక పార్టీ ఫిరాయింపులు, ఎవరినో మోసం చేసే ఉద్దేశం లేదనిరేణుక అన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేణుక వివరించారు. వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధి కి సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తేలిక తెలిపారు. దానితో అటు కార్యకర్తల నుంచి కూడా టీడీపీలో చేరాలనే డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేణుక వివరించారు.