చంద్ర‌బాబు ఇలాఖాలో రీపోలింగ్‌…..?

Friday, May 17th, 2019, 07:00:59 PM IST

ఎన్నిక‌ల ఫ‌లితాలు ద‌గ్గ‌రప‌డుతున్నా కొద్దీ ఏపీలో రోజుకో చిత్రం చోటు చేసుకుంటోంది. స‌మ‌స్యాత్మ‌క ప్రాంత‌మైన చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలోని ప‌లు కేంద్రాల్లో రీపోలింగ్ జ‌రిపించాల‌ని ఎన్నిక‌ల సంఘం సిఫార‌సు చేసింది. ఇదే వైఎస్సార్ సీపీ, టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య ర‌చ్చ‌కు దారితీస్తోంది. ఐదు బూతుల్లో టీడీపీ నేత‌లు య‌ధేచ్ఛ‌గా రిగ్గింగ్ కు పాల్ప‌డ్డార‌ని తేల‌డంతో ఇక్క‌డ రీపోలింగ్ అనివార్యంగా మారింది. తిరుప‌లి పుణ్య‌క్షేత్రానికి 16 కిలోమీట‌ర్ల దూరంలో వున్న ఈ నియోజ‌క వ‌ర్గంతో పాటు చుట్టుప‌క్క‌ల వున్న ఏడు గ్రామాల్లోని ఎన్ ఆర్‌ క‌మ్మ‌ప‌ల్లిలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 698. ఇందులో మ‌హిళ‌లు 362, పురుషులు 336.

అయితే ఇందుఓ మొత్తం 658 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. ఇక్క‌డ ద‌ళితుల‌కు ఓటు లేదు. వారికి అండ‌గా ఏ పార్టీ నిలిచినా వారిని త‌న్ని త‌రిమేయ‌డం ఇక్క‌డి టీడీపీ నేత‌లకు ఆన‌వాయితీగా మారింది. అక్క‌డ ఓటు హ‌క్కు కోసం ద‌ళితులు ఏళ్లుగా పోరాటం చేస్తూనే వున్నారు కానీ వారికి ఓటు హ‌క్కు మాత్రం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది. ఈ విష‌యం గుర్తించిన వైసీపీ నేత చెవిరెడ్డి ఆ ఐదు బూత్‌ల‌లో రీపోలింగ్‌కు ప‌ట్టుబ‌ట్టారు. అది సీఎస్ ఎల్‌వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ద్వారా నే జ‌రిగింద‌ని, అత‌ని ఆదేశాల మేర‌కే ఆ ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగింద‌ని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ప‌రిస్థితులు వేరేగా వున్నాయి. ద‌ళితులని టీడీపీ వ‌ర్గాలు అణ‌చివేయ‌డం వ‌ల్లే అక్క‌డ ఓటింగ్ శాతం పెర‌గ‌డం లేద‌ని గ్ర‌హించిన ప‌లు రాజ‌కీయ వ‌ర్గాలు చాలా ఆక‌లంగా వారి ఓటు హ‌క్కు కోసం ఆర్జీలు పెడుతూనే వున్నా అవి కీక వ్య‌క్తుల వ‌ద్ద‌కు చేర‌కుండా టీడీపీ మ్యానేజ్ చేస్తంద‌ని, అదే ఇప్పుడు చంద్ర‌గిరిలో రీపోలింగ్‌కు ప్ర‌ధాన కార‌ణంగా మారింద‌ని అక్క‌డి సాధార‌ణ ఓట‌ర్లు చెబుతున్నారు.