అగ్ర‌వ‌ర్ణాల బిల్లు రాజ్యాంగ విరుద్ధ‌మా?

Wednesday, January 9th, 2019, 10:00:43 AM IST

అగ్ర వ‌ర్ణాల పేద‌ల‌కు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డానికి ఉద్దేశించ‌న 124వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం ప్ర‌వేశ‌పెట్టింది. ఇంత వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్‌లు వ‌ర్తించ‌ని వారిలో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టామ‌ని కేంద్ర‌మంత్రి థావ‌ర్ సింగ్ గెహ్లోట్ స్ప‌ష్టం చేశారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని 43వ అధిక‌ర‌ణ‌లో పొందుప‌రిచిన ఆదేశిక సూత్రాల ప్ర‌కారం బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల విద్య‌, ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చాల్సి వుంది.

దీనితో పాటు అర్గ‌వ‌ర్ణాల పేద‌ల‌కు విద్య‌, ఉద్యోగ రంగాల్లో అవ‌కాశాలు క‌ల్పించాలి. ఇందు కోసం వున్న 46వ అధిక‌ర‌ణ‌ను పూరి్త స్థాయిలో అమ‌లు ప‌ర‌చ‌డానికి రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా అది చెల్ల‌ద‌ని న్యాయ‌నిపుణులు చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. బిల్లును న్యాయస్థానాల్లో స‌వాల్ చేసే వీలుంద‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది రాకేష్ దివ్వేది, రాజీవ్ ధావ‌న్‌, అజిత్ సిన్హా అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయ పార్టీలు ఈ బిల్లును రాజ‌కీయ ఆయుధంగా వాడుకోవాల‌ని తెర‌పైకి తీసుకురావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని న్యాయ నిపుణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.