చంద్రబాబు, లోకేష్ లపై వేసిన కేసు నిలబడలేదు!

Thursday, September 27th, 2018, 02:05:17 AM IST

ముఖ్యమంత్త్రి చంద్రబాబు కుమారుడు, పంచాయితీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తండ్రి అండతో కోట్ల విలువైన భూముల్ని పలు బోగస్ కంపెనీలకు కట్టబెట్టారని, ఐటీ పాలసీని రూపొందించి, దీని ద్వారా త్వరితగతిన అనుమతులిచ్చేలా చట్టంలో మార్పులు చేసి పలు కంపెనీలను ఆకర్షించి విశాఖలో 400 కోట్ల విలువైన 40 ఎకరాల భూముల్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి అతి తక్కువ ధరకు ఇచ్చారని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని రిటైర్డ్ న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం సరైన సాక్ష్యాలు చూపాలని కోరింది. కానీ స్రావం అలాంటివేమీ దాఖలు చేయలేదు. దీంతో కోర్టు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా కేసులు వేయడం ఏమిటని శ్రవణ్ కుమార్ ను ప్రశ్నించింది. సరైన సాక్ష్యాధారాలు తీసుకొస్తేనే కేసును స్వీకరిస్తామని, ఇలా రాజకీయపరమైన వ్యవహారాలకు కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేయడం సరికాదని, అలాంటివి ఎనైవా ఉంటే బయట చూసుకోవాలని మందలించింది. దీంతో శ్రవణ్ పిటిషన్ను వెనక్కు తీసుకోక తప్పలేదు.