“ఈవెంట్స్ నౌ” పై రేవంత్ ఆగ్రహం..!

Saturday, October 27th, 2018, 03:32:49 PM IST

హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో “సెన్సేషన్ రైజ్ ” పేరిట ఈవెంట్స్ నౌ సంస్థ చే డాన్స్ కార్యక్రమం నిర్వహింప బడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమ నిర్వాహకుల పై తెలంగాణ కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. ఈవెంట్స్ నౌ సంస్థ ఈ కార్యక్రమం ముసుగు లో యువత ను మాదక ద్రవ్యాలకు బానిసలూ చేస్తుందంటూ మండిపడ్డారు. అంటే కాకుండా ఈ సంస్థ అంమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అధిక స్థాయిలో డబ్బులు పుచ్చుకొని మైనర్లను సైతం ఈ కార్యక్రమానికి అనుమతిస్తుందని ఆక్షేపించారు.

స్వయానా మంత్రి కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాల కు చెందిన ఈ సంస్థ తెలంగాణ యువత ను పెడదోవ పట్టించే కార్యక్రమాలకు పాల్పడుతోందని దీని పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను కోరారు. అయన జోక్యం చేసుకోని పక్షం లో తామే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా ఇప్పటికే బెంగుళూరు పుణేల్లో సెన్సేషన్ రైజ్ కార్యక్రమాన్ని నిషేదించారని , అయినప్పటికీ హైదరాబాద్ లో ఈ కార్యక్రమ నిర్వహణ కు ఎందుకు అనుమతించారంటూ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా టాస్క్ఫోర్స్, సిట్ అధికారులు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు.

  •  
  •  
  •  
  •  

Comments