రేవంత్ టార్గెట్ మొదలైంది.. వర్కౌట్ అవుతుందా?

Saturday, January 13th, 2018, 03:50:47 AM IST

ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో నాయకుల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీ పనులపై తీవ్ర విమర్శలు చేస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు. మొన్నటి వరకు టీఆరెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడీ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో కూడా తన స్పీడ్ ను చూపిస్తున్నారు.
టీఆరెస్ ప్రభుత్వంపై మాటల తూటాలను పేల్చుతున్నారు. రీసెంట్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక సవాల్ విసిరారు.

కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చాలా జరిగిందని చెప్పారు. అంతే కాకుండా ఆధారాలతో సహా నేను నీరూపిస్తానని తెలిపారు. గన్ పార్కు వద్ద మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చాలా తప్పులు చేశాడు. అయన అవినీతి బాగోతంపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నా. ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. నిరూపించకపోతే ఆబిడ్స్ సెంటర్ లో ముక్కు నేలకు రాస్తా..అని చెప్పుకొచ్చారు.

అయితే ఇటీవల రేవంత్ నియోజక వర్గం వైపు ఉన్న కొంత మంది కార్యకర్తలు టీఆరెస్ వైపు మొగ్గు చూపారు. ఎలాగైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో రేవంత్ అడ్డాలో టీఆరెస్ సత్తా చూపించాలని అక్కడ క్యాడర్ ని బలపరుచుకుంటోంది. దీంతో రేవంత్ కూడా ముందుగానే తన జాగ్రత్తలో తాను ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు. అధికార పార్టీ లోపాలను గుర్తించి ప్రశ్నించే విధంగా సవాల్ ని విసురుతున్నాడు. తన మద్దతుదారులను తగ్గించుకోకుండా చేయాలనీ టీఆరెస్ పై విమర్శలను చేస్తూ జనాలను ఆకర్షిస్తున్నాడు. మరిన్ని సమస్యలపై కూడా రేవంత్ ప్రశ్నించే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం. మరి ఈ ప్లాన్ రేవంత్ కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments