కేసీఆర్ ద‌గ్గ‌ర కాప‌లా కుక్క‌లా? రేవంత్ పంచ్‌లు!!

Tuesday, October 31st, 2017, 10:30:41 AM IST

విశేష రాజ‌కీయ‌ ప‌రిజ్ఞానంతో, ప‌దునైన ప‌ద‌జాలంతో ఎదుటివాడిని ఉక్కిరిబిక్కిరి చేయ‌గ‌లిగేవాడే మ‌హానేత కాగ‌ల‌డు! ఈ విష‌యంలో తెలంగాణ నాయ‌కుడు రేవంత్ రెడ్డి అంద‌రికంటే ప‌ది ఆకులు ఎక్కువే తిన్నార‌ని చెప్పాలి. తేదేపాని వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే వేళ అత‌డి ప్ర‌సంగాలు చూస్తుంటే అందులో వాడి వేడి ఓ రేంజులో ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్‌ని తిట్టేయ‌డంలో ఆయ‌న‌ను కొట్టేవాడే లేడు అన్న‌ట్టే మాట తీరు సాగింది. పంచ్‌లు .. ప‌టాస్‌ల‌తో ద‌డ‌ద‌డ‌లాడించాడు రేవంత్‌.

ఓ ప్ర‌సంగంలో రేవంత్ ప‌లికిన ప‌లుకులు ప‌రిశీలిస్తే.. వాహ్వా! అన‌కుండా ఉండ‌లేం. పార్టీ మార్పు వేళ తెలంగాణ ప్ర‌జ‌ల‌నుద్ధేశించి రేవంత్ మాట్లాడారు. ఆ సంద‌ర్భంలో పంచ్‌లేంటో ప‌రిశీలిస్తే.. “కేసీఆర్ ద‌గ్గ‌ర కాప‌లా కుక్క‌లా ప‌డుంటారా? ఆయ‌న‌కి ఎదురెళ్లి మ‌నుషులుగా బ‌తుకుతారా?“ అంటూ చ‌క్క‌ని ప్రాస‌తో కూడిన పంచ్‌లు వేశారు. ప్ర‌స్తుత స‌న్నివేశంలో కేసీఆర్ వామ‌నుడిలాగా ప్ర‌జ‌ల నెత్తిన అడుగు వేశార‌న్న‌ది రేవంత్ పంచ్‌లోని అంత‌రార్థం. మ‌రో పంచ్ ప‌రిశీలిస్తే.. “కేసీఆర్‌కి కాళ్ల కింద చెప్పులానో, నెత్తిమీద గొడుగులానో బతుకుతారా? ఎదురెళ‌దాం.. రండి నాతో.
ఎన్టీఆర్ అందించిన పౌరుషంతో బ‌తుకుదాం.. “ అంటూ నాకౌట్ రేంజ్ పంచ్ విసిరాడు. చంద్ర‌శేఖ‌ర్ రావుకి వ్య‌తిరేకంగా పోరాడండి.. అంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు. ఇక చంద్ర‌బాబుపై పాజిటివ్ పంచ్ వేస్తూ, కేసీఆర్‌ని త‌గ్గించే ప్ర‌య‌త్నంలో విసిరిన పంచ్ అదిరింది. “ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం వ‌చ్చినా.. చంద్ర‌బాబు వ‌దులుకుంటే, ప‌ద‌వి కోసం కేసీఆర్ క‌క్కుర్తి పడ్డాడు.. సీఎం అయ్యాక ప్ర‌జ‌ల్ని వంచిస్తున్నారు“ అంటూ సూటిపోటి మాట‌ల‌తో కేసీఆర్‌ని ఎటాక్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు రేవంత్‌. మ‌రి అత‌గాడి పంచ్‌ల‌కు కేసీఆర్ సాబ్ ఎలాంటి రివ‌ర్స్ పంచ్‌లు వేస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments