అందరి పేర్లను డైరీలో రాసుకుంటున్న రేవంత్ రెడ్డి!

Friday, September 14th, 2018, 12:43:18 PM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణా కేసు నమోదవడం తీవ్ర దుమారాన్ని రేపింది. తమ పార్టీ పెద్ద తలనే ప్రధాన నిందితుడిగా చూపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిప్పులు కక్కుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసును 360 డిగ్రీల్లో తవ్వేసి మానవ అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మమమ్మద్ రషీద్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అందరికీ పంచుతూ కేసీఆర్, ఆయన అధికారుల్ని గ్రిల్ చేసి పారేస్తున్నారు.

రషీద్ ఇచ్చిన వాంగ్మూలంలో అప్పట్లో కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్ రావులు గుజరాత్ కు చెండియాన్ వారిని అక్రమంగా అమ్రికకు పంపారని, దానికోసం వారి వారి లెటర్ హెడ్లపై సిపార్సు లెటర్లు రాసి మరీ సహకరించారని, ఈ వాంగ్మూలంలో జగ్గారెడ్డి పేరే లేదని అన్న ఆయన ఇకనైనా గవర్నర్ మేలుకుని అసలైన నిందితులపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ తనకు అనుకూలమైన పోలీసు అధికారుల చేత కాంగ్రెస్ నేతలపై ఉన్న పాత కేసుల్ని తవ్వించే పనిలో ఉన్నారన్న అయన కేసీఆర్ కు సహకరిస్తూ తమపై తప్పుడు కేసుల్ని బనాయిస్తున్న అధికారులు అందరి పేర్లను డైరీలో రాసుకుంటున్నానని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లెక్కలనీ సెటిల్ చేస్తామని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments