టిఆర్ఎస్ ఫ్యూజ్ తీస్తానంటున్న రేవంత్ రెడ్డి..!

Friday, January 12th, 2018, 02:20:31 AM IST

తెలంగాణాలో ఇప్పుడు ఒకటే చర్చ. అంతా 24 గంటల విద్యుత్ గురించే చర్చించుకుంటున్నారు. 24 గంటల విద్యుత్ ని ప్రవేశ పెట్టిన కేసీఆర్ రైతుల్లో మార్కులు కొట్టేశారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అదంతా బూటకమని విమర్శిస్తోంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడుతా అంటూ గర్జించారు.

టిఆర్ఎస్ ఎంపీ సుమన్ మరియు రేవంత్ రెడ్డి మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చర్చకు రావాలని ఎంపీ బాల్క సుమన్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తాను చర్చకు సిద్దమే అని అన్నారు. విశ్వసనీయత లేని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో తాను చర్చించనని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, షబ్బీర్ అలీ వంటి వారి చర్చకు రావాలని అన్నారు. దీనితో టిఆర్ఎస్ పార్టీ తన చర్చకు బయటి తోకముడిచి పారిపోయిందని రేవంత్ అన్నారు. రేపటి ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అవినీతిని బయట పెడుతా అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments