ఆ మూడు స్థానాలే టార్గెట్ అంటున్న రేవంత్ రెడ్డి..!

Friday, December 7th, 2018, 03:00:45 AM IST

తెలంగాణ ఎన్నికల పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క లగడపాటి రోజుకొక సర్వేతో రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతున్నారు. మరో పక్క పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ పార్టీయే నుగ్గుతుందని, తనకు కీలకపదవులు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజకూటమి గనక అధికారంలోకి వస్తే తన పాత్ర మొదటి మూడు స్థానాల్లో ఉండబోతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ లో చేరిన మొదటి నుండి తెరాస ముఖ్యనాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తనదయిన శైలిలో విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి, దీంతో కేసీఆర్ కు సమాధానం చెప్పగల సత్తా కాంగ్రెస్ లో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని అంటున్నారు అంతా. రేవంత్ వ్యాఖ్యల విషయానికొస్తే మొదటి మూడు స్థానాలు అనగా సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మంత్రి స్థానాలు ప్రభుత్వం కీలకమైనవి. కాబట్టి ఈ మూడు స్థానాల్లో ఎదో ఒకటి రేవంత్ రెడ్డిని వారించబోతుంది అని తెలుసుకున్న ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, తెలంగాణాలో పర్యటించిన సందర్బంగా గులాం నబి ఆజాద్ ” ఏమో రేవంత్ రెడ్డి సీఎం అయినా కావచ్చు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.