కేసీఆర్ ఆస్తుల‌పై విచార‌ణ‌?

Monday, October 1st, 2018, 03:56:05 PM IST

తెలంగాణ రాష్ట్ర అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆస్తుల‌పై విచార‌ణ సాగిస్తారా? గ‌త నాలుగేళ్ల‌లో వంద‌ల‌-వేల కోట్ల అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన కేసీఆర్‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాక ముందు, వ‌చ్చిన త‌ర్వాత అత‌డి ఆస్తులు ఎంతెంత ఉన్నాయో నిగ్గు తేల్చాల‌ని త‌న‌దైన శైలిలో వ‌రుచుకు ప‌డ్డారు.

కేసీఆర్, మోదీ క‌లిసే త‌న‌పై కుట్ర ప‌న్నార‌ని రేవంత్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌నపై వేదింపుల వెన‌క పెద్ద స్కెచ్ ఉంద‌ని అన్నారు. మోదీ ప్ర‌భుత్వం నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, రాఫెల్ కుంభ‌కోణం వంటి వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తాన‌ని భ‌య‌ప‌డ్డారు. అందుకే కేసీఆర్‌తో క‌లిసి కుట్ర చేశార‌ని ఆరోపించారు. కేసీఆర్ అక్ర‌మాల‌పై ఇప్ప‌టికే ఐదు కేసులు వేశాన‌ని వాటిలో గెలిచి తీర‌తాన‌ని రేవంత్ అన్నారు. కేసీఆర్ సిద్ధ‌మైతే మేమిద్ద‌రం సిట్టింగ్ జ‌డ్జి ముందే విచార‌ణ‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని తెలిపారు. కొడంగ‌ల్ ప్ర‌జ‌ల్లోకి తేరాస అధినాయ‌కుడి దుర్మార్గాన్ని తీసుకెళ‌తాన‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఈ దుర్మార్గాన్ని వివ‌రిస్తాన‌ని తెలిపారు. మొత్తానికి కేసీఆర్, మోదీల‌పై రేవంత్ డేరింగ్ ఎటాక్స్ త‌న అభిమాన గ‌ణాన్ని అంత‌కంత‌కు పెంచుతోంది. త‌న‌పై ఐటీ దాడులు జ‌రిగినందుకు రేవంత్‌పై ఈసారి సింప‌థీ వ‌ర్క‌వుటై ఓట్ల రూపంలోకి మారడం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది గులాబీ బాస్ సెల్ఫ్ గోల్ అన్న మాట కేసీఆర్‌ సొంత పార్టీలోనే వినిపిస్తోంది.