కెసిఆర్ ఏకులా వచ్చి మేకులా అవుతున్నాడు..రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

Wednesday, October 17th, 2018, 12:47:43 PM IST

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ముఖ్య అభ్యర్థి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం మరింత వేగవంతం చేశారు.ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉండటంతో కెసిఆర్ మరియు వారి యొక్క పార్టీ వైఫల్యాలను బలంగా ప్రజలులోకి తన ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్తున్నారు.అదే క్రమంలో 20 మంది కార్యకర్తలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిని రేవంత్ కండువా కప్పి ఆహ్వానించారు.అదే సమయంలో తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి కెసిఆర్ పై మాట్లాడుతూ అసలు నువ్ ఇక్కడి ప్రజలకు ఏం మంచి పని చేసావని నీకు ఓటెయ్యాలని ప్రశ్నించారు.ఎప్పుడైనా మా పిల్లలు బడిలో చదువుకుంటున్నారో లేదో పట్టించుకున్నావా?పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఎవరినైనా అడిగి కనుక్కున్నవా అని ప్రశ్నించారు.మరి అలాంటప్పుడు నీకు అసలు ఓటు ఎందుకెయ్యాలి మండిపడ్డారు.అసలు ఏ పని చెయ్యని నీకు ఎందుకు ఓటెయ్యాలో చెప్పు అని కెసిఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు మాత్రమే బాగుపడతారని తెలంగాణా ప్రజలకు మాత్రం ఏ న్యాయం జరగదని మండిపడ్డారు.కెసిఆర్ ఏకులా వచ్చి మేకులా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.