టిఆర్ఎస్ లో టిడిపి విలీనమా..ఎమ్మెల్యే ల సంగతేంటి..?

Tuesday, September 27th, 2016, 01:50:02 AM IST

revanth-reddy
తెలంగాణా లో అధికారపార్టీ టిఆర్ ఎస్ పై సంధించేందుకు ప్రతిపక్షాలకు మంచి అస్త్రాలే దొరుకుతున్నాయి.మల్లన సాగర్ భూనిర్వాసితుల వివాదం, కొత్త జిల్లాల ప్రతిపాదన, తాజా గా కురిసిన వర్షాలతో హైదరాబాద్ లో అద్వానంగా మారిన రోడ్లు. ఈ అంశాలన్నీ ప్రతిపక్షాలకు కలసి రానున్నాయి.తాజాగా తెలంగాణా టిడిపిలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం నెలకొంది.

తెలంగాణా టిడిపి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యే లు గెలిచారు. వారిలో 12 మంది ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావంతో టిఆర్ఎస్ లో చేరిపోయారు.దీనితో ఇక టిడిపిలో ముగ్గురు ఎమ్మెల్యే లు మాత్రమే మిగిలారు.దీనితో 12 మంది ఎమ్మెల్యే లు టిడిపిని టిఆర్ ఎస్ లో విలీనం చేస్తునట్లు ప్రకటించారు. దీనితో తెలంగాణా నేత టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రగడ పై కోర్టుని ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు మొదట పార్టీ మారిన ఎమ్మెల్యే ల భవితవ్యం తేల్చాలని ఆతరువాతే విలీనం గురించి మాట్లాడాలని సూచించింది. దీనితో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నైతికంగా విజయం సాధించినట్లైంది.అసెంబ్లీలో టిడిపిని టిఆర్ ఎస్ లో విలీనం చేయాలని కేసీఆర్ భావించారు.కానీ తాజా హైకోర్టు తీర్పుతో కొంతకాలం విలీనం అంశం ముగిసినట్లేఅని అంటున్నారు.