మద్దతు ధర గురించితెలియని వాళ్ళు నాయకులా సిగ్గు చేటు : ఎర్రబెల్లి

Thursday, April 5th, 2018, 11:01:13 AM IST

పాలించే నాయకుడిని… పార్టీని విమర్శించే హక్కు ఉంటే ప్రజలకు ఉన్నప్పుడు జవాబు చెప్పే బాధ్యత కూడా ఉండాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ పార్టీపైనా, నేతలపైనా విమర్శలు చేశారు. మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాని కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జలయత్నం అంటూ ధనయగ్నం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ప్రాజెక్టులను తెచ్చామో కనిపించడం లేదా. తండాలని గ్రామపంచాయతీలుగా మీరు ఎందుకు గుర్తించలేదు. దళితుల గురించి మాట్లాడే నైతక హక్కు కాంగ్రెస్ పార్టీకి అస్సలు లేదన్నారు. పాలకూర్తి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో మోకాలు లోతు బొందలుంటే ఇప్పుడు ఎటువంటి రోడ్లు ఉన్నాయో కనిపించడం లేదా అభివృద్ధి చేసింది ఎక్కడ పోప్యింది అనుకున్నారు అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్. రేవంత్‌రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి ఎందుకు వచ్చావు… అప్పుడే ఈ విషయం ఎందుకు చెప్పలేదని అడిగారు. నేను నీలాగా పూటకో పార్టీ మారలేదు. పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశాను. నన్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.