తెలంగాణ కాబోయే సీఎం గురించి హాట్ హాట్ గా..!!

Friday, October 20th, 2017, 08:42:59 AM IST


తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చేసుకోబోతున్నాయా ? కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్ కు అండగా నిలబడబోతున్నాయా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయనపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఒంటి కాలిపై లేచే వారు. ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. కానీ ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో పరిస్థితి తారుమారైంది. రేవంత్ జోరు తగ్గడంతో పాటు టీడీపీ పరిస్థితి కూడా తెలంగాణలో దిగజారిపోయింది. దీనితో నేతలు ఒక్కొక్కరుగా అధికారపార్టీలోకి జారుకునే పరిస్థితి నెలకొంది. తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అని పునరాలోచనలో పడిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో సెటిల్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా కీర్తించబడిన నేత సీనియర్ నేతలతో తీవ్రమైన పోటీ ఉన్న కాంగ్రెస్ లో ఎలాంటి స్థానం లభించే అవకాశం ఉంది.

తెలంగాణాలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని భావిస్తున్నారు. సాధారణంగానే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ పార్టీలో ఎవరు అనే చర్చ ఉంది. 2019 ఎన్నికలు సమీపిస్తుండడం, రేవంత్ వంటి మాస్ లీడర్ ఆ పార్టీలో చేరబోతుండడంతో ఈ చర్చ ఇంకాస్త హాట్ హాట్ గా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ వంటి సీనియర్ నేతలు సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. వారి జాబితాలోకి రేవంత్ కూడా చేరబోతున్నారు. పిసిసి చీఫ్ ని మార్చి టి కాంగ్రెస్ లో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ కనుక పార్టీలో చేరి మంచి ఫలితాలని రాబట్టగలిగితే అతడినే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్న మాట. సుదీర్ఘంగా రేవంత్ కాంగ్రెస్ అధిష్టానంతో జరుపుతున్న చర్చల సారాంశం కూడా ఇదే అని అంటున్నారు. రేవంత్ తమకు పోటీ వచ్చే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ లోని కొందరు నేతలే ఆయన చేరికని వ్యతిరేకిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments