రేవంత్ లేఖ: ఇంట్లో మనిషిగా చూసుకున్నారు.. కానీ

Sunday, October 29th, 2017, 03:30:20 AM IST

మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి. సుదీర్ఘ రాజకీయాలు, పాలన అనుభవం ఉన్న మీతో ప్రయాణం మరచిపోలేనిది. మీ సారథ్యంలో అనేక ప్రజా పోరాటాల్లో భాగస్వామి కావడం నా అదృష్టం. అంటూ తన లేఖలో ప్రతి ఒక్క అనుభవాన్ని ఆలోచనను రేవంత్ రెడ్డి తెలువుతూ చంద్రబాబు కు ఈ రోజు లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ టీడీపీ పార్టీని విడవడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఆయన చంద్రబాబు కు రాజీనామా లేఖ అందజేయడం ఒక సంచలనాన్ని సృష్టిస్తే అందులో చెప్పిన కొన్ని విషయాలు మరింత సంచలనంగా మారింది.

మీ అనుచరుడిగా, తెదేపా నేతగా గుర్తింపు పొందడం నేను గర్వించే విషయం. తెదేపాలో చేరిన నాటి నుంచి మీ నిర్ణయాలకు కంకణబద్ధుడినై పనిచేశాను. పార్టీలో తక్కువ సమయంలోనే నాకు గుర్తింపు దక్కింది. పేదల బాగు కోసం అన్న ఎన్టీఆర్‌ తపించిన విధానం నాకు స్ఫూర్తి’ సీనియర్లు ఎంతో మంది ఉన్నా కీలక అవకాశాలను పార్టీ నాకు ఇచ్చింది. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. మీతోపాటు నేను అంతగా అభిమానించేది వాళ్లనే. లక్షల మంది కార్యకర్తలు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు.

ప్రజల పక్షాల ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్‌ సహించలేకపోతున్నారు. ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్రంలో చోటులేదు. అత్యున్నత వ్యవస్థలను తన అధికార దర్పానికి కాపలాకాసే సంస్థలుగా మార్చుకున్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం నిరాఘాటంగా సాగుతోంది. ఈ దుర్మార్గాలపై గడిచిన మూడేళ్లుగా అసెంబ్లీలోనూ, వెలుపల టీడీపీ పోరాటం చేస్తోంది. సభలో ప్రజల గొంతుక వినిపించే ప్రతి సందర్భంలో మాపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అని లేఖలో రేవంత్ పేర్కొన్నాడు అలాగే కేసీఆర్ పై కూడా కూడా కొన్ని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments