అంతా బాబుకే చెబుతా..గొడవేసుకున్న రేవంత్ రెడ్డి..?

Friday, October 20th, 2017, 03:21:38 PM IST

తాజగా జరిగిన టి టిడిపి కార్యవర్గ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. గత కొన్ని రోజులు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం జరిగిన టిడిపి కార్యవర్గ సమావేశానికి హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. కాగా మిగిలిన సీనియర్ టీడీపీ నేతలు రేవంత్ ని జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీని కలిసారా ? ఒక వేళ కలిస్తే అధినేత చంద్రబాబు అనుమతి లేకుండా ఎందుకు కలిశారో చెప్పాలి. జరుగుతున్నపరిణామాలపై మీ సమాధానం ఏంటి ? అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. కానీ తాము ఏమడిగినా రేవంత్ రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేదని టీడీపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.అంతా బాబు గారికే చెప్పుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారట. రేవంత్ నేతల ప్రశ్నలకు స్పందించకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ లు సమావేశం నుంచి అర్థాంతరంగా లేచి వెళ్లిపోయారు. తాజగా రాజకీయ పరిమాణాలు, రేవంత్ రెడ్డి అంశం టీడీపీ బాస్ చంద్రబాబుకు తలనొప్పి వ్యవహారంలా మారాయి.