బ్రేకింగ్ న్యూస్ : ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా!

Thursday, September 6th, 2018, 12:50:45 PM IST

తెలంగాణ కాంగ్రెస్ లో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామ చేసి ఊహించని విధంగా అందరికి షాక్ ఇచ్చారు. స్పీకర్ ఫార్మట్ లో తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో సమ్పరించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలపై ఒక్కసారిగా అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. మొదట రేవంత్ స్పీకర్ ను కలవడానికి ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ మధుసూధనా చారి మీటింగ్ లో బిజీగా ఉన్నట్లు చెప్పడంతో వెంటనే స్పీకర్ పీఏకు రాజీనామా అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ అధికార నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. తాను ఇలాంటి పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఒక సభ్యుడిగా ఉండలేనని చెబుతూ రాజీనామా చేసినట్లు వివరణ ఇచ్చారు. ఇక రేవంత్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments