కెసిఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..నియోజకవర్గం మారితే 10కోట్లు ఇస్తా.!

Saturday, October 13th, 2018, 10:49:37 AM IST

ఈ రోజు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో టీకాంగ్రెస్ ముఖ్య అభ్యర్థి రేవంత్ రెడ్డి తెరాస పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐటీ దాడులు మోడీ మరియు కెసిఆర్ ల ప్రమేయంతోనే జరుగుతున్నాయని ఆరోపించారు.అంతే కాకుండా ఆయన పార్టీకి చెందినటువంటి తెలంగాణా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయని నరసింహా రెడ్డి గారికి కెసిఆర్ చేసినటువంటి అన్యాయాన్ని తెలిపారు.

ఎప్పటి నుంచో కెసిఆర్ కు తోడుగా వెన్నంటే ఉన్న నాయని నరసింహా రెడ్డినే మోసం చేశారని తెలిపారు.గత నెల రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్ ను ముషీరాబాద్ కు చెందిన సీటును తనకు గాని తన అల్లుడుకి గాని ఇవ్వమని కోరగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కెసిఆర్ కనీసం వాళ్లని కలవడానికి అనుమతి కూడా ఇవ్వట్లేదని తెలిపారు.అంతే కాకుండా 2014 ఎన్నికల్లో నాయని నరసింహ రెడ్డి ముషీరాబాద్ టికెట్ అడగగా తాను అక్కడ కాకుండా ఎల్ బి నగర్ నుంచి పోటీ చేస్తే 10 కోట్లు ఇస్తానని కెసిఆర్ ఆశ చూపించాడని అన్నారు.ఈ మాటలన్నీ నాయని నరసింహ రెడ్డి గారే అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ పక్కనుండి ఎంతో శ్రమించిన నరసింహ రెడ్డి కి టిక్కెట్టు ఇవ్వకపోగా కనీసం ఆయన్ని కలవడానికి కూడా నోచుకోవట్లేదని తెలిపారు.