కాంగ్రెస్ పార్టీ అంటే ఇది..తెలుసుకో కెసిఆర్:రేవంత్ రెడ్డి!

Sunday, October 21st, 2018, 11:19:47 AM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.ఒకపక్క ఈ సారి కూడా విజయం మాదే అని కెసిఆర్ సర్కార్ ధీమాగా ఉన్నా మిగతా పార్టీలు మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం తెరాస ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదని కంకణం కట్టుకున్నారు.అదే సందర్భంలో ఏ పార్టీకి సంబందించిన నేతలు వారియొక్క కేంద్ర స్థాయి అధికారుల ప్రతినిధుల సమక్షంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇప్పుడు కూడా తాజాగా టీకాంగ్రెస్ పార్టీ వారు వారి పార్టీ ప్రధాన అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నిన్న ఒక భారీ బహిరంగ సభను ఒకటి ఏర్పాటు చేశారు.

ఈ సభకు గాను టీకాంగ్రెస్ యొక్క ప్రధాన నేతలు ప్రతీ ఒక్కరు పాల్గొన్నారు.అదే సందర్భంలో టీకాంగ్రెస్ నేతల్లో ముఖ్యమైన నేత మరియు వారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద విరుద్చుకుపడ్డారు.సోనియా గాంధీ కుటుంబం ఎప్పుడు అధికారమే ప్రధాన లక్ష్యంగా పాకులాడలేదని,సోనియా గాంధీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా సరే మన్మోహన్ సింగ్ గారిని ప్రధాన మంత్రిని చేశారే తప్ప తాను పదవివైపు కన్నెత్తి చూడలేదని తెలిపారు.అంతే కాకుండా ఈ దేశానికి ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిపారు.ఇన్ని రోజులు దేశానికి నాయకత్వం ఇవ్వడానికే పదవులు ఆశించలేదని,ఇప్పుడు ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం అవసరం కాబట్టే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కెసిఆర్ తెలుసుకోవాలని అన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవడం చాలా అవసరమని,అందుకోసం మనం ఇక్కడ కెసిఆర్ మీద అందరం పోరాటం చెయ్యాలని సూచించారు.