కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Tuesday, November 6th, 2018, 08:21:56 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోరుకు సంసిద్ధమైన పార్టీల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కొంత మంది అభ్యర్థులు మరియు తెరాస పార్టీ నేతల మధ్య పోటీలా మారిపోతుంది.అందులోనూ టీకాంగ్రెస్ మరియు తెరాస పార్టీల మధ్య అయితే అది తారా స్థాయిలో ఉంటుంది.తెరాస పార్టీ నుంచి కేటీఆర్,కెసిఆర్ లు కాంగ్రెస్ నేతలకు కౌంటర్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రేవంత్ రెడ్డిలు ఎదురు దాడి చెయ్యడంలో ముఖ్యులు.ఈ రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరిగినటువంటి టీకాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తెరాస పార్టీ మీదాను మరియు కెసిఆర్ కుటుంబం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్కడి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ రోజు కర్రు కాల్చి కారు గుర్తుకు వాటీహాలు పెట్టాల్సిన సమయం వచ్చిందని,కెసిఆర్ ఏమో సీట్లో కూర్చోకుండా అతని ఫామ్ హౌస్ లో మందు తాగి పడుకుంటాడని,అలాంటి వ్యక్తి నడిపేటటువంటి కారులో కూర్చుంటే ఆ బండి చక్కగా నడుపుతాడా?వారి ఇంట్లో ఒక్కొక్కడు కారు లోని ఒక్కొక్కడు ఒక్కో పార్టును పట్టుకుపోతారని,హరీష్ హ్యాండ్ బ్రేక్ దగ్గర ఉంటే కవిత ఏమో యాక్సిలరేటర్ దగ్గర ఉంటుంది,కేటీఆర్ ఇంకెక్కడో ఉంటాడని,అలాంటప్పుడు వీరికి మద్దతు ఇస్తే మనకి మంచి జరుగుతుందా అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments