నన్ను ఏ జైల్లో పెట్టినా సరే గెలిచి చూపిస్తా..రేవంత్ రెడ్డి సవాల్!

Friday, September 28th, 2018, 09:03:16 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో అక్కడి రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కిపోతున్నాయి.అంతే కాకుండా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఒక ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్న పర్వంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై అకస్మాత్తుగా జరిగినటువంటి ఐటీ దాడులతో తెలంగాణా ఎన్నికల్లో మరింత వేడి పుట్టుకొచ్చింది.

రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఐటీ దాడులు జరిగాయి అందువలన రేవంత్ రెడ్డి ఈ వార్త కాస్త ఆలస్యంగా తెలిసింది.అయినా ఏ మాత్రం బెదురు చెందకుండా తన ప్రచారాన్ని కొనసాగించారు,అదే సమయంలో మాట్లాడుతూ కెసిఆర్ మరియు నరేంద్ర మోడీ కేంద్రంలో కలిసిపోయి తన మీద ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని,తనని ఇక్కడే కాదు అండమాన్ జైల్లో పెట్టినా సరే కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 50 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గి చూపిస్తానని సవాల్ విసిరారు.