2018 తెలంగాణా బిగ్ ఫైట్.. టీఆర్ఎస్ పై మ‌రో బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి..!

Wednesday, November 21st, 2018, 09:32:31 AM IST

తెలంగాణలో డిసెంబ‌ర్ 7న‌ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం యుద్ధాన్ని త‌ల‌పిస్తోంది. ఒక‌వైపు టీఆర్ఎస్ మ‌రోవైపు మ‌హాకూట‌మి నువ్వా నేనా అన్న‌ట్టు పోటీ పడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ పార్టీలు ఇప్ప‌టికే త‌మ త‌మ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో టిక్కెట్ రాని అసంతృప్తులు వెంట‌నే పార్టీలు మారి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుత‌న్నారు.

తాజాగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌డం అక్క‌డి రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వ‌ర‌లోనే టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు, ముగ్గుర‌ ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయ‌బోతున్నారంటూ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విష‌యం అప్ప‌డు లైట్ తీసుకున్నా.. ఇప్పుడు తాజాగా ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్ప‌డంతో టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేపింది.

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామాపై తాజాగా స్పందించిన రేవంత్ రెడ్డి మ‌రో బాంబు పేల్చ‌డంతో టీఆర్ఎస్‌లో వ‌ణుకు పుడుతోంది. ఆయ‌న మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్ర‌మే అని డిసెంబ‌ర్ 7లోపు ఇంకా కొన్ని టీఆర్ఎస్ వికెట్లు ప‌డ‌నున్నాయని వ్యాఖ్యానించి మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపారు రేవంత్ రెడ్డి. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా టీఆర్ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. గ‌త కొంత కాలంగా టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న యాద‌వ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేర‌నున్నార‌నే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. అయితే ఇప్ప‌టికే విశ్వేశ్వ‌ర్ రెడ్డి రాజీనామాతో ఖంగుతిన్న టీఆర్ఎస్‌కు త్వ‌ర‌లోనే మ‌రోషాక్ త‌గ‌ల‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.