తెరాస కుండ పగులుద్ది..రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

Thursday, November 8th, 2018, 05:02:32 PM IST

తెలంగాణ ఎన్నికలలో వేడి రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతుంది.ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యంగా తెరాస మరియు టీకాంగ్రెస్ నేతల మధ్యలో మాటల దాడి తారా స్థాయిలో జరుగుతుంది.ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు.ఈ రోజు తెరాస నేత హరీష్ రావు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసిన తీరు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసినదే,అయితే ఈ మాటలకు గాను టీకాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వారి రాష్ట్ర శ్రేయస్సు కోసమే నీటి కోసం కేంద్రానికి లేఖలు రాసి ఉంటారని,ఇందులో తెరాస నేతలు తప్పుబట్టాల్సిన అవసరం ఏమి లేదని తెలిపారు.అంతే కాకుండా చంద్రబాబు ఎప్పటినుంచో కేంద్రానికి లేఖలు రాస్తుంటే అప్పుడు మీ కెసిఆర్,కేటీఆర్ లే ఎన్ని లేకలు రాసుకున్నా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారని తెలిపారు.మరి అలాంటప్పుడు వీరు ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నారో అని ప్రశ్నించారు.హరీష్ రావు,కేటీఆర్ లు ఏదో కెసిఆర్ ని సంతోష పెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారని,వారి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి అని,అతి త్వరలోనే తెరాస కుండ పగులుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.