రేవంత్ సంచలన నిర్ణయం- నేను ఓడిపోతే జీవితంలో మీకు కనిపించను

Thursday, December 6th, 2018, 04:50:17 PM IST

తెలంగాణా ఎన్నికల నేపథ్యం లో చాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. తాజాగా రేవంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. కొడంగల్‌ పౌరుషానికి, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతోందని, ఒకవేళ ఇందులో రేవంత్ ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరాడు. తన నియోజక వర్గం లో కొడంగల్‌, బొమ్మరా్‌సపేట, దౌల్తాబాద్‌, మద్దూరు, కోస్గి మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో ఆయనరోడ్‌షో లో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ ‘‘మీ భుజాలపై పెట్టుకొని చూసుకోవడంతో ఇంతటివాడినయ్యాను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్‌ పేరును వినిపించి రాహుల్‌గాంధీని ఇక్కడికి తీసుకువచ్చాను. నిన్న మొన్న ఒకడొచ్చి.. తాను మీ ఊరికి అల్లుడినని చెబుతున్నాడు. అంతకుముందు ఎప్పుడైనా వచ్చి మీ కష్టాల గురించి అడిగాడా?’ అని రేవంత్‌ అన్నారు.

రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్‌ నియోజవర్గానికి పెద్ద కొడుకునని, అందరి కష్టాల్లో అండగా ఉంటానని తెలిపారు. ఎం అభివృద్ధి చేశాడని మల్లి ఓట్లు అడగడానికి కెసిఆర్ వచ్చాడు అని ప్రశ్నించారు. తెరాస కి మీటింగ్‌ పెట్టుకోవడానికి గతిలేక.. తాను, తన కార్యకర్తలు కష్టపడి తయారు చేసిన మైదానంలో సిగ్గులేకుండా సభ పెట్టుకున్నారని విమర్శించారు. లగడపాటి రాజగోపాల్‌తో కేటీఆర్‌ చీకటి వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. వారందరు కూడా కలిసే, చాటుగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించాడు. ఈ సారి తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని, పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఇకమీదట తెలంగాణకి తలా దించుకునే పరిస్థితి రాదు అని రేవంత్ రెస్య్ మాట్లాడారు.