చంద్రబాబు,రాహుల్ గాంధీ కలయిక పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

Friday, November 2nd, 2018, 02:39:13 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఒరవడి తీసుకోచ్చారు,ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ సారి వచ్చే పోటీకి దిగుతున్నారని ఖరారు చేసేసారు.అయితే చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఒక వర్గం నేతలు మాత్రం తమ ఆగ్రహాన్ని చూపుతున్నారు.మరీ ముఖ్యంగా అయితే తెలంగాణా లోని తెరాస నేతలు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.అదే సందర్భంలో టీకాంగ్రెస్ ముఖ్య నేత అయినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు రాహుల్ గాంధీతో కలవడం పై ఆయన స్పందనను తెలియజేశారు.

అటు కేంద్రంలో మోడీ మరియు ఇక్కడ రాష్ట్రంలో కెసిఆర్ లు తీవ్ర నష్టం కలిగించారని,చంద్రబాబు మరియు రాహుల్ గాంధీల యొక్క కలయిక దేశంలో నూతన అధ్యాయానికి తెర తీసింది అని,ఇప్పటి వరకు దేశంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో తెరాస నేతలు చేసినటువంటి అన్యాయాలను అన్నిటిని ,మనం చూసాము అని ఈ పరిస్థులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీలు కలవడం ద్వారా దేశానికి అవసరమైన బలమైన నాయకత్వం వస్తుందని తెలిపారు.

కూటములను కూడగట్టి దేశానికి ఏ విధంగా నాయకత్వం వహించాలో ఈ రెండు పార్టీలకు అపారమైన అనుభవం ఉంది అని,కెసిఆర్ అయినా మోడీ అయినా ఏం చేసినా సరే హనుమంతుని ముందు కోతి చేసిన కుప్పి గంతుల్లాగే ఉంటాయని వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments