అవమానం.. రేవంత్ విసిరిన ఛాలెంజ్ లో ఓడిపోయిన కేసిఆర్ !

Wednesday, November 21st, 2018, 03:51:23 AM IST

టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి తాజా ఉదంతమే ఉత్తమమైన ఉదాహరణ. ఇప్పటికే తమకు ప్రాముఖ్యత లేదని కొందరు నాయకులు కారు దిగిపోగా తాజాగా చేవెళ్ల ఎంపీ విశేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపింది. గత పార్టీ మారతారనే వార్తలు జోరుగానే సాగుతున్నా గులాబీ నేతలు మాత్రం అదేం లేదని బుకాయిస్తూ వచ్చారు.

కానీ ఈరోజు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా విశేశ్వర్ రెడ్డి లాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేత పార్టీని వీడటం, అదీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఇలా జరగడంతో కేసిఆర్ ను సందిగ్ధంలో పడేసింది. విశేశ్వర్ రెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు నేతలంతా ప్రచారంలో పాల్గొంటుంటే ఆయన మాత్రం రోడ్డెక్కిన దాఖలాలు లేవు. తన సొంత జిలాల్లో తనను కాదని మంత్రి మహేందర్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడమే విశేశ్వర్ రెడ్డి రాజీనామాకు కారణమని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే కేసిఆర్ తన పార్టీ ఎంపీలని కాంగ్రెస్ లోకి రాకుండా చూసుకోవాలని ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో ఇలా సిట్టింగ్ ఎంపీ పార్టీకి రాజీనామా చేయడం ఒకరకంగా కేసిఆర్ కు పెద్ద ఎదురుదెబ్బనే అనాలి.