రాహుల్ తలుచుకుంటే ఆయనే సీఎం – రేవంత్ రెడ్డి !

Sunday, September 30th, 2018, 08:56:14 PM IST

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తలుచుకుంటే సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి అవుతాడని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజికవర్గంలోని భిక్కునూర్ లో జరిగిన బైక్ ర్యాలీ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గత రెండు ధపాలుగా ఓడిపోతున్నా షబ్బీర్ అలీ ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్నాడని ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఈ నియోజకవర్గంలో ఒకసారైనా కనిపించారా అని ప్రశ్నించారు. అలాగే షబ్బీర్ అలీ కాబోయే ఉప ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ తలుచుకుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వాఖ్యానించారు.

కేసీఆర్ ను రాజకీయంగా లేకుండా చేయడానికి తాను ఈ పర్యటనలు చేస్తున్నానని నామీద ఎన్ని కేసులు పెట్టిన భయపడనని దాంట్లో భాగంగానే నాపై ఐటీ దాడులు జరిగాయని అయన అన్నారు.