జస్ట్ లెటర్.. కేసీఆర్ ని ఇరకాటంలోకి నెట్టిన రేవంత్..!

Tuesday, November 14th, 2017, 03:50:16 AM IST

రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ పై పోరాటం కోసమే టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి చేరిపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం కోసం ఏ విధమైన మార్గాన్ని ఎంచుకుంటారు అనే చర్చ జరుగుతుండగా తొలి అడుగు వేశారు. చాలా సాఫ్ట్ గానే రేవంత్ రెడ్డి తన తొలి ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. ఇంకా చెప్పాలంటే తెలివైన నిర్ణయం అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వ్యక్తుల కుటుంబాలని దుస్థితిని ఆయన తెరపైకి తీసుకుని వచ్చారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు లేఖ రాసారు. బలిదానాలు చేసిన కుటుంబాలని ఆదుకోవాలనేది రేవంత్ లేఖలో సారాంశం. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి గౌడ్ అనే వ్యక్తి తెలంగాణ కోసం ఆత్మ త్యాగం చేసుకున్నాడు. ఆ విషయం ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఉంది. కానీ అతడి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రేవంత్ ఆరోపించారు. నిజామాబాద్ కలెక్టర్ కు ఈ విషయం పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ కోసం ఆత్మ త్యాగాలు చేసిన కుటుంబాలన్నింటికీ న్యాయం జరగాలని రేవంత్ ఆకాంక్షించారు. ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడ్డ కుటుంబాలు ఇంకా అనేకం ఉన్నాయని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.

కాగా సెంటిమెంట్ తో కూడుకున్న అంశాన్ని లేవనెత్తిన రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments