మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్ గెలుపు క‌ష్ట‌మేనా?

Saturday, March 16th, 2019, 09:04:36 AM IST

అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల మ‌ధ్య కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ స్థానాల‌కు తొలి విడ‌త 8 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న ఏఐసీసీ కార్యాల‌యంలో క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టిన కాంగ్రెస్ రాత్రి ప‌ది గంట‌ల‌కు 8 మందితో తొలిజాబితాను ప్ర‌క‌టించింది. ఇక్క‌డ విశేషం ఏంటంటే గ‌త శాస‌న స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో తెరాస అభ్య‌ర్థుల్ని ముందే ప్ర‌క‌టించి జోరుగా ప్ర‌చారం మొద‌లుపెడితే తాజాగా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం ఇప్ప‌టికీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌లేదు. ఇదీ ఓ ఎత్తుగ‌డే. కాంగ్రెస్ ఎవ‌రిని ప్ర‌క‌టిస్తుందో తెలిసిన త‌రువాతే త‌మ అభ్య‌ర్థుల్ని వెల్ల‌డించాల‌ని కేసీఆర్ ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ తొలి జాబితా తేల‌డంతో తెరాస కూడా త‌మ తొలి జాబితాను సిద్ధం చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన 8 మందిలో కొడంగ‌ల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డికి మ‌ల్కాజ్‌గిరి కేటాయించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెద్ద‌గా ప‌ట్టులేని ఈ స్థానం నుంచి రేవంత్ గెల‌వ‌డం అసాధ్యం. ఇది తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను ప్ర‌క‌టించ‌డం విడ్డూర‌మే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కాంగ్రెస్ ప్ర‌క‌టించిన తొలి జాబితాలో పోటీప‌డుతున్న అభ్‌య‌ర్థులు వీరే.. మ‌ల్కాజ్‌గిరి రేవంత్‌రెడ్డి, ఆదిలాబాద్ ర‌మేష్ రాథోడ్‌, మ‌హ‌బూబాబాద్ బ‌ల‌రాం నాయ‌క్‌, పెద్ద‌ప‌ల్లి ఎ. చంద్ర‌శేఖ‌ర్‌, క‌రీంన‌గ‌ర్ పొన్నం ప్ర‌భాక‌ర్‌, జ‌హీరాబాద్ మ‌ద‌న్‌మోహ‌న్‌, చేవెళ్ల కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, మెద‌క్ గాలి అనిల్‌కుమార్‌.