రివ్యూ : “దేవదాస్” – చూడదగిన చిత్రమే

Friday, September 28th, 2018, 03:55:17 AM IST

నాని మరియు నాగార్జున హీరోలుగా తెరకెక్కిన చిత్రం క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “దేవదాస్”.మంచి అంచానాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది,ఆ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

దాస్(నాని) ఒక అమాయకమైన,ఉద్వేగభరితమైన వైద్యుడు.తీవ్రంగా గాయపడిన దేవా(నాగార్జున) అనే అండర్ వరల్డ్ డాన్ కి రహస్యంగా తన క్లినిక్ లో వైద్యం చేస్తూ ఉంటాడు,దాస్ యొక్క ప్రవర్తనన దేవాని ఆకట్టుకోవడంతో దేవా, దాస్ ని తరుచూ కలవడానికి వస్తూ ఉంటాడు.దానితో వారిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు.తరువాత అంతా బాగానే గడుస్తుంది అనుకుంటే ఒక రోజు దాస్ కళ్ళ ముందే దేవా నవీన్ చంద్ర అనే పాత్రని చంపెయ్యడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.అసలు ఈ దేవా ఎవరు?అతని వెనుకున్న కథ ఏమిటి?అతను ఈ చీకటి ప్రపంచంలో ఎందుకు బతుకుతున్నాడు.?ఇద్దరు కథానాయికలకు ఈ కథకి ఉన్న సంబంధం ఏమిటి?దేవా మరియు దాస్ లు వారికొచ్చిన సమస్యలను ఎదుర్కొని ఎలా బయటపడ్డారు అన్న సంగతి తెలుసుకోవాలి అంటే థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. దర్శకుడు యొక్క కథ మరియు కధనం చర్చించడానికి పెద్దగా ఏమి లేదు.ఇతను ఒక సాధారణమైన చిన్న స్టోరీ లైన్ ని పట్టుకొని దానికి కొంచెం హాస్యం జోడించి కథని నడుపుతూ కాస్త సేఫ్ గేమ్ ఆడాడు అని చెప్పుకోవాలి. కథాంశం మరియు దాన్ని తీర్చిదిద్దే దిశా మీద అతను పనిచేసినట్లయితే, ఇంకా మంచి ఫలితం ఉండేది.పాత్రధారుల నటన విషయానికి వచ్చినట్టయితే, కింగ్ నాగార్జున తనలోని రొమాంటిక్ షేడ్ ని మళ్ళీ చూపించారు.అతని పాత్ర మొదటి నుంచి,వినోదాత్మకంగానే నడుస్తుంది.నాగార్జున తెర మీద ఉన్నంత వరకు ప్రేక్షకులకు కన్నుల పండుగలాగే ఉంటుంది.ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే నాగార్జున యొక్క ఎంట్రీ సన్నివేశం ఈ మధ్య వచ్చినటువంటి నాగార్జున చిత్రాల్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.మరో హీరో నాని అమాయకుడిగా, అధికారం చెలాయించే డాక్టర్ గా సరిగ్గా కుదిరేసాడు. ఎప్పటిలాగే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తోనూ తన సహజ నటనతోను ఈ చిత్రానికి మరింత పరిపూర్ణత అందించాడు.ఫస్ట్ హాఫ్ లో నాగార్జున మరియు నానీల మధ్య ఉండే స్నేహపూరిత సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి అని చెప్పాలి.హీరోయిన్స్ రష్మికా మందన్న మరియు అకాంక్ష సింగ్ లు తెరపై అందంగా కనిపించారు.వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.వెన్నల కిషోర్ మరియు సత్య మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్లో మంచి నవ్వులను పండిస్తాయి.చిత్రంలో ఉన్నటువంటి రెండు పాటలు బాగానే చిత్రీకరించారు.

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున మరియు నానీల మధ్య సన్నివేశాలు
ఆహ్లాదంగా సాగిపోయే ఫస్ట్ హాఫ్
నాగార్జున అద్భుత నటన
సినిమా తీర్చిదిద్దిన తీరు

మైనస్ పాయింట్స్ :

బలహీనమైన కథ
సెకండ్ హాఫ్ లో విసుగు పుట్టించే కొన్ని సన్నివేశాలు
పాటలను ఇంకాస్త బాగా చిత్రీకరించి ఉంటె బాగున్ను

తీర్పు :

మొత్తంగా చూసుకుంటే దేవదాస్ సినిమా.ఫస్ట్ హాఫ్ లో సరదాగా ఉండే అంశాలతో కూడిన రెగ్యులర్ ఫార్ములాజిక్ చిత్రం.తెర మీద నాగార్జున యొక్క అద్భుతమైన నటన మరియు నాని యొక్క సహజ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్.కానీ బలహీనమైన కథాంశం మరియు సాగదీసే సెకండ్ హాఫ్ ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.వెండి తెరపై నాగార్జున మరియు నానీలను మీరు చూడటం ఇష్టపడుతున్నట్లయితే, ఈ వారాంతం మంచి ఎంటెర్టైనెర్ గా ఈ చిత్రంతో ముగుస్తుంది.

Netiap.com Rating : 3/ 5