రివ్యూ : నాటకం – బోరింగ్ లవ్ స్టోరీ

Friday, September 28th, 2018, 04:06:04 PM IST

నూతన దర్శకుడు కల్యాణజీ గొనగ దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘నాటకం’. సాయి కీర్తిక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

చింతలపూడి అనే గ్రామంలో బాల కోటేశ్వరరావు (అశిశ్ గాంధీ) సరదాగా ఖాళీగా తిరుగుతుంటాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న క్రమంలో పార్వతి (అషిమా నర్వల్‌)ని చూసి ప్రేమలో పడతాడు. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తోంది. ఇద్దరు శారీరకంగా ఒకటవుతారు. అలా సాగుతున్న వీరి ప్రేమ కథలో కొన్ని చిన్న చిన్న అపార్ధాల దాటుకొని చివరకి కోటి, పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి అయ్యాక పార్వతి గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు కారణంగా కథ మొత్తం మారుతుంది. అసలు పార్వతి ఎవరు ? ఆమె కోటి జీవితంలోకే ఎందుకొచ్చింది ? అసలు ఆమె గతం ఏమిటి ? ఆ గతం కారణంగా కోటి జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి ? అనేదే ఈ చిత్రం.

విశ్లేషణ:

ఈ సినిమాలో హీరోగా నటించిన అశిశ్ గాంధి తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో గాని, ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో గాని అశిశ్ గాంధి చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన అషిమా నర్వల్‌ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దర్శకుడు కల్యాణజీ గొనగ రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ..కథలో ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది.

ప్లస్ పాయింట్స్:

అశిశ్ గాంధీ నటన.
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ
హీరోకి, అతని ఫాదర్ కి మధ్య సాగే సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

బలహీనమైన కథ,
కథనం ఆసక్తికరంగా సాగకపోవడం.
రిపీట్ డ్ సీన్స్ ఎక్కువ అవ్వడం
సినిమాలో సరైన ప్లో లేకపోవడం.

తీర్పు:

అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆకట్టుకునే విధంగా తెరకెక్కపోవడంతో.. ఈ సినిమా బాగా నిరుత్సాహ పరుస్తోంది. కానీ ఈ సినిమాలో హీరోగా నటించిన అశిశ్ గాంధి తన నటనతో, మ్యానరిజమ్స్ తో ఆకట్టుకుంటాడు. దర్శకుడు కల్యాణజి ఈ సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని సాగతీత సన్నివేశాలతో, ప్లో లేని స్క్రీన్ ప్లే తో విసుగు తెప్పిస్తారు. మొత్తం మీద ఈ ‘నాటకం ‘ చిత్రం ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోదు.

Netiap.com Rating : 2.25/ 5