రివ్యూ రాజా తీన్‌మార్ : కాశి – ఒక సినిమా.. మూడు కథలు

Friday, May 18th, 2018, 04:45:11 PM IST

తెరపై కనిపించిన వారు : విజయ్ ఆంటోని, అంజలి, సునైన
కెప్టెన్ ఆఫ్ ‘ కాశి’ : కిరుతిగ ఉదయనిధి

మూల కథ :
అమెరికాలోని భరత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చీఫ్ భరత్ (విజయ్ ఆంటోనీ) జీవితంలోని అన్ని రకాల సుఖాలతో హాయిగా ఉంటాడు. కానీ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి అతన్ని పెద్దయ్యాక కూడ వెంటాడుతూ ఉంటుంది. ఆ తరుణంలోనే అతనికి తన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తన కన్న తల్లిదండ్రులు కారని తెలుస్తుంది.

దీంతో అతను తనను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఇండియా బయలుదేరుతాడు. అలా ఇండియా వచ్చిన భరత్ తన తల్లి దండ్రుల్ని కనుక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఇంతకీ అతని తల్లిదండ్రులెవరు అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :
→  దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి సినిమాను హీరో పాత్రతో మొదలుపెట్టిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. మొదలైన కాసేపటికే హీరో కన్న తల్లిదండ్రుల వేటలో పడేయడంతో చిత్రం ఇంట్రెస్టింగా మారింది. స్టోరీ లైన్ కూడా బాగేనా ఉంది. కనుక మొదటి విజిల్ ఆమెకే వేయాలి.
→  విజయ్ అంటోనీ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేసి మెప్పించాడు. కనుక రెండో విజిల్ ఆయనకే వేయాలి.
→  సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా, రీజనబుల్ గా ఉన్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
→  సినిమా మొదలైన కాసేపటికే పక్కదారి పట్టి వేరొకరి కథలోకి వెళ్లిపోవడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది.
→  దర్శకురాలు హీరో కథలోకి ఇంకో ఇద్దరు అనవసరమైన వ్యక్తుల కథల్ని ఇరికించి చేద్దామనుకున్న ప్రయోగం బెడిసికొట్టింది.
→  మధ్యలో వచ్చే పాటలు, హీరోయిన్ తో లవ్ ట్రాక్ పరమ బోర్ అనిపించాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
→ సాధారణంగా హీరో ఉండే కథ సినిమాకు మూలం కానీ ఈ సినిమాలో మాత్రం హీరో లేని ఇంకో రెండు కథలు సినిమను నడుపుతాయి. అదేం విచిత్రమో మరి..

సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది…

మిస్టర్ ఎ : అరే.. మనమిప్పుడు ఎన్ని సినిమాలు చూసాం ?
మిస్టర్ బి : సినిమాలేంటి.. సినిమా కదా !
మిస్టర్ ఎ : అవును కదా మరి అందులో మూడు కథలెందుకు చూపించారు ?
మిస్టర్ బి : ఆ విషయం నీకు మాత్రమే కాదు చూసిన ఎవరికీ అర్థమయ్యుండదు.

Comments