రివ్యూ : సవ్యసాచి

Friday, November 2nd, 2018, 09:42:35 AM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈచిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది . మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం …

కథ :

విక్రమ్ ( నాగ చైతన్య ) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిని కలిగి వుండడం వల్ల ఆయన రెండు చేతులకి సమాన బలం ఉంటుంది. ఇక మరోవైపు విక్రమ్ మేనకోడలు ( భూమిక కూతురు) ని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ మిస్టరీ వెనుక అరుణ్ (మాధవన్ ) వున్నాడని తెలుసుకుంటాడు. ఇంతకీ అరుణ్ ఎవరు ? ఎందుకు భూమిక కూతురుని కిడ్నాప్ చేస్తారు ? అసలు విక్రమ్ ఫ్యామిలీ ని ఎందుకు టార్గెట్ చేస్తారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

డిఫ్రెంట్ కథను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి అంతే ఆసక్తిగా కథనాన్ని నడింపించలేకపోయారు. మొదటి 20 నిమిషాలను ఆసక్తిగా అనిపించినా తరువాత లవ్ సీన్స్ తో బోర్ కొట్టించాడు. అయితే ఇంటర్వెల్ ముందు మళ్ళీ తన పట్టు చూపించుకున్నాడు. ఇక ద్వితీయార్థంలో విలన్ కు హీరో కు మధ్య జరిగే పోరును డీసెంట్ గా చూపించాడు.

ఇక నటన విషయానికి వస్తే విక్రమ్ పాత్రలో నాగ చైతన్య ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. ప్రతినాయకుడి పాత్రలో మాధవన్ అలరించాడు . హీరయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ గా కనిపించింది అంతే కానీ నటన పరంగా ఆమె చాలా ఇంప్రూవ్ కావాల్సి వుంది.

తెర మీద కనిపించింది కొద్దీసేపైన తన నటన తో ఆకట్టుకుంది. ఇక వెన్నెల కిశోర్ , సత్య ఉన్నతంలో బాగానే నవ్వించారు. రెండు సాంగ్స్ బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి .

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ

నేపథ్య సంగీతం

నిన్ను రోడ్డు మీద అనే సాంగ్ లో చైతు డ్యాన్స్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

ఆసక్తిగా లేని కథనం

హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ స్టోరీ

రొటీన్ గా ఉండడం

తీర్పు :

రొటీన్ రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ ‘సవ్యసాచి’ చిత్రం పర్వాలేదనిపించింది. ట్విన్ సిండ్రోమ్ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ ని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేక పోవడంతో ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. చివరగా ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రాన్ని ఒక సారి చూడొచ్చు.

Rating : 3/5