రివ్యూ : వీర భోగ వసంత రాయలు

Thursday, October 25th, 2018, 10:29:20 PM IST

 

నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీ విష్ణు , శ్రీయ శరణ్ కలిసి నటించిన చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈచిత్రం రెండు రోజుల ముందే యూఎస్ లో విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీయ ముగ్గరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ . ఈ ముగ్గరు డిఫ్రెంట్ మిస్టరీ కేసులను డీల్ చేస్తారు . ఇంతకీ ఆ కేసు లేంటి ? ఈ అన్నింటికి కామన్ గా ఒక దానితో ఒకటి ఏమైనా సంబంధం వుంటుందా ? అసలు ఈ చిత్రం యొక్క మెయిన్ పాయింట్ ఏంటి ? అసలు వీర భోగ వసంత రాయలు ఎవరు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :

నూతన దర్శకుడు ఇంద్రసేన మంచి పాయింట్ ను తీసుకున్న దాన్ని తెరమీదకు తీసుకురావడంలో పూర్తిగా తడపడ్డాడు. క్రైమ్ జోనర్ లో వచ్చిన ఇలాంటి చిత్రానికి ఆసక్తికర ట్విస్ట్ లతో పాటు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే చాల అవసరం. ఈసినిమా చూస్తే దర్శకుడు ఈ రెండు విషయాలను పట్టించుకున్నట్లు లేడనిపిస్తోంది.

ఇక ఈచిత్రానికి చూసిన తరువాత అసలు ఏం చూసి ఈసినిమా ను నారా రోహిత్ , శ్రీయ , సుదీర్ బాబు ఒప్పుకొన్నారో అనే డౌట్ రాక మానదు. ఇక బరువైన పాత్రలో నటించిన శ్రీ విష్ణు ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. ఆయన లుక్ కూడా ఆర్డినరీ గా వుంది. ఇక ఈసినిమాలో మెచ్చుకోదగ్గ అంశం ఏదయినా ఉందంటే అది చివరి 15నిమిషాలు మాత్రమే.

ప్లస్ పాయింట్స్ :

చివరి 15నిమిషాలు

కొన్ని ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

కథ , కథనం

తక్కువ బడ్జెట్తో కూడిన నిర్మాణ విలువలు

తీర్పు :

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వీర భోగ వసంత రాయలు ప్రేక్షకుడి చాలా వరకు నిరాశకు గురిచేస్తుంది. కానీ చివరి 15నిముషాలు సస్పెన్స్ ను బాగానే రివీల్చేశాడు దర్శకుడు అయితే ఎంగేజింగ్ గా లేని కథనం దానికి తోడు అతి తక్కువ బడ్జెట్ చిత్రాన్ని పేలవంగా మార్చేశాయి. చివరగా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిన ఈ చిత్రానికి దూరంగా ఉంటేనే మంచిది.

 

Rating : 1.5/5

  •  
  •  
  •  
  •  

Comments