ప్యాంటు బెల్టులో బంగారం మాఫియా…

Sunday, April 29th, 2018, 02:10:56 AM IST

ఎక్కడైనా బంగారం గానీ, వజ్రాలు గానీ లేదా ఇంకేవైన విలువైన వస్తువులు బ్యాగుల్లో గానీ, చక్నీ కవర్లలో గానీ అక్రమంగా రవాణా చేయడం చూశాం. కానీ ఇక్కడ ఒక క్రిమినల్ ఏకంగా తాను వేస్కున్న ప్యాంటు బెల్టులోనే బంగారం బిస్కేట్లను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. ఇది గుర్తించిన ఎయిర్పోర్టు సిబ్బంది అతన్ని పట్టుకొని బెల్టు మొత్తం విప్పి చూశారు. 400 గ్రాములున్న ఈ బంగారం విలువ సుమారు రూ. 12 లక్షలుగా సమాచారం. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments