మా మధ్య అలాంటివేం లేవన్న వర్మ..!

Wednesday, December 5th, 2018, 04:50:37 PM IST

సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, వర్మ ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి పూరీని కలవకుండా వెళ్ళాడు. అప్పట్లో వర్మ శ్రీ రెడ్డికి మద్దతు పలకడంతో పూరి వర్మల మధ్య సంబంధాలు చెడాయని వార్తలొచ్చాయి. రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయం ఎలాంటిదైనా ముక్కుసూటిగా చెప్పే స్వభావం ఉన్న మనిషి, అందులోను సుదీర్ఘ కాలం పాటు పూరి జగన్నాథ్ తో స్నేహాన్ని శ్రీ రెడ్డి లాంటి ప్రాధాన్యం లేని సంఘటన వల్ల వదులుకునే మనిషి కాదు.

ఈ నేపథ్యంలో భైరవగీత సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన వర్మ, పూరిని కలవకుండా వేరే స్నేహితుడి ఇంటికి వెళ్లడంటూ వార్తలొచ్చాయి. ఈ విషయం వర్మ దాకా వెళ్లటంతో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ” ఈ వార్తల్లో నిజం లేదు, నేను, పూరి ఎపుడూ లేనంత గాఢ స్నేహంలో ఉన్నాం” అని ట్వీట్ చేసాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వర్మ నిర్మాతగా భైరవగీత చిత్రం ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం చేసారు.