‘ఆగడు’ను ఆస్కార్ కు పంపాలంటున్న వర్మ

Saturday, September 20th, 2014, 07:00:34 PM IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు విసురుతూనే వున్నాడు. ఆగడు సినిమా విడుదలైన వెంటనే మగధీర సినిమాకు పోలిక పెట్టిన వర్మ.. తాజాగా మరో కామెంట్ చేశాడు. ఆగడు సినిమాను ఏకంగా ఆస్కార్ కే పంపించాలని సెటైర్లు విసిరాడు. ఆగడు’ సినిమాలోని డైలాగ్స్ ని, డైలాగ్ మాడ్యులేషన్ ని స్పెషల్ నామినేషన్ క్రింద ఆస్కార్ ఎంట్రీకి పంపాలని, ప్రపంచ సినిమా చరిత్రలో ‘ఆగడు డైలాగ్స్, డైలాగ్ డెలివరీ ఎప్పటికీ నిలబడిపోతాయని వర్మ తాజాగా ట్వీట్ చేశాడు.

కోన వెంకట్ ఇంత అద్భుతమైన డైలాగ్స్ రాయగలడని తాను అనుకోలేదని, తాను వెళ్లేసరికి సినిమా టైటిల్స్ అయిపోయాయని, అసలు ఇంతకీ డైలాగ్స్ రాసింది కోన వెంకటేనా? అని ప్రశ్నించాడు. నిజానికి గతంలో శ్రీనువైట్ల సినిమాలకు రైటర్ గా పని చేసే కోన వెంకట్ ‘ఆగడు’ సినిమాకు పనిచేయలేదు. మరి దీనిని కూడా సెటైర్ అనే అనుకోవాలేమో.

అంతేకాదు.. ప్రకాష్ రాజ్ తన కెరీర్ లో ఓ బెస్ట్ క్యారెక్టర్ ను ‘ఆగడు’ లో ‘మిస్’ అయ్యాడని వర్మ మరో సెటైర్ వేశాడు. (ఈ సినిమాలో ముందుగా విలన్ పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత దర్శకుడు శ్రీను వైట్లకు, ప్రకాష్ రాజ్ కు వచ్చిన వివాదం కారణంగా.. ఆ పాత్రకు ఆయన్ను తప్పించి సోనూ సూద్ ను తీసుకున్నారు). ఫైనల్ గా, మహేశ్ గొప్ప నటుడని.. దయచేసి మహేశ్ మంచి పాత్రలు ఎంచుకునే విధంగా అభిమానులు ఆయనపై ఒత్తిడి తేవాలని వర్మ ట్వీట్ చేశాడు. మొత్తానికి వర్మ సినిమాలపై, రాజకీయలపై తనదైన శైలిలో సెటైర్లు విసురుతూనే వున్నాడు.

వర్మ లేటెస్ట్ ట్విట్లు ఇవే..
The dialogue and dialogue modulations of “Aagadu” should be sent to Oscars on a special award…They will truly stand out in world cinema
I can’t believe Kona venket can write such gems of dialogues. ..by the way i missed the titles ..did Kona write?