అది నా హక్కు.. పూరి ఫీల్ అవ్వడం ఆతని హక్కు : వర్మ

Sunday, May 13th, 2018, 10:55:30 AM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ చేయడంలో వర్మ ప్రస్తుతం బిజీ అయ్యాడు. అయితే వర్మ ఎలాంటి ఇంటర్వ్యూ చేసినప్పటికీ పవన్ పై చేయించిన ఆరోపణలకు సంబందించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇకపోతే ఇటీవల మరోసారి దానిపై వివరణ ఇచ్చాడు. వర్మ మాట్లాడుతూ.. నేను పవన్ – శ్రీ రెడ్డి వివాదం గురించి క్లియర్ గా వీడియో లో చెప్పాల్సింది చెప్పను. అందులో మీ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. మరోసారి మిరే ఆ వీడియో చూడండి అని వర్మ సమాధానం చెప్పాడు. అంతే కాకుండా పూరి జగన్నాథ్ కామెంట్స్ పై స్పందిస్తూ.. కామెంట్స్ చేయడం నా హక్కు.. ఫీల్ అవ్వడం పూరి జగన్నాథ్ హక్కు.. నేను చెప్పే విషయాలను అర్డం చేసుకొని వాళ్లు సైకో అని, పర్వర్ట్ అని అంటుంటారని అలాంటి విషయాలు తాను పెద్దగా పట్టించుకోనని వర్మ తెలిపాడు.