రేవంత్ రెడ్డిని బాహుబలి చేసేశాడుగా..!

Monday, October 30th, 2017, 05:59:57 PM IST

అది పాలిటిక్స్ అయినా, సినిమా అయినా మరే విషయమైనా సరే తనకు తిక్కరేగిందంటే కెలకకుండా వర్మ వదలడు. వివాదాలతో ఆడుకోవడం అంటే ఈ దర్శకుడుకి భలే సరదా. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రకటించిన వార్తల్లో నానుతున్న ఈ దర్శకుడు తాజాగా రేవంత్ రెడ్డి అంశాన్ని టచ్ చేశారు. రేవంత్ రెడ్డికి నా సందేశం ఇదే అంటూ వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరడం వలన కాంగ్రెస్ పార్టీపై మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓ సినిమా థియేటర్ అయితే రేవంత్ రెడ్డి అందులో బాహుబలి. బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపించినట్లుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తాడు’ అంటూ ఆర్జీవీ రేవంత్ ని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.