పవన్ ని రెచ్చగొడుతున్నాడే..!

Wednesday, January 3rd, 2018, 05:37:10 PM IST

రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థి రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదురుకావడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి విభిన్నంగా ఉంది. రాజకీయ నాయకుల కంటే నాన్ పొలిటిషియన్ల నుంచే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వర్మ ఎప్పుడు తిడతాడో ఎప్పుడు పొగుడుతాడో అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. మరో వైపు ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే మరో వ్యక్తి.. ఖాళి ఉన్న ప్రతి వార్త ఛానల్ కు వెళ్లి పవన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. వీటిపై పవన్ స్పదించకున్నా ఆయన అభిమానులకు మాత్రం తెగ ఇబ్బందిగా మారాయి. తాజగా వర్మ పవన్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైనప్పటి నుంచి పవన్ తో వర్మ పోలిక పెడుతున్నాడు. రజినీకాంత్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారని అన్నారు. రజినీలా అన్ని స్థానాల్లో పోటీ చేయకపోతే పవన్ కళ్యాణ్ ఓ ఆర్డినరీ నటుడిగా మాత్రమే మిగిలిపోతారని అన్నారు. పవన్ కు అన్ని స్థానాల్లో పోటీ చేసే గట్స్ లేకపోతే ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు పవన్ ని కేవలం సాధారణ నటుడిగా మాత్రమే పరిగణిస్తారు. రజినీకాంత్ లా సూపర్ స్టార్ కాలేరని వర్మ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.