ఆర్జీవీ నీ పరిస్థితి ఇలా అయిందేంటయ్యా... అన్నీ కాపీలేనా…

Friday, May 18th, 2018, 05:38:05 PM IST

ప్రముఖ సంచలన దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ మళ్ళీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. నాగార్జునా ప్రధాన పాత్రలో, ఆర్జీవి దర్శకత్వంలో ఈ నెల 25న రానున్న చిత్రం ఆఫీసర్. తాజాగా 2 తీజర్లు, ఒక ట్రైలర్ ని రిలీజ్ చేస్కొని ప్రేక్షకుల్లో బాగా ఉత్సాహాన్ని నింపిన ఈ సినిమా కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. అంటా బాగానే ఉంది. ఇక్కడే వచ్చిపడింది ఓ కొత్త చిక్కు. ఏమిటా అనుకుంటున్నారా.. ఆర్జీవీ దగ్గర పని చేసి హిందీ చిత్రం సర్కార్ 3 కథను అందించిన ఓ యువకుడు ఆఫీసర్ కథ కూడా నాదేనని వివాదానికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఆర్జీవి పెద్ద డైరెక్టర్, ఆయన మోసం చేసే మనిషి కాదనుకొని నేను రాసుకున్న 9 సినిమా కథలను ఆర్జీవికి ఇచ్చాను, కానీ అవి అయన పేరుతొ ఇప్పుడు సినిమాలుగా మారి కా కళ్ళముందుకు వస్తుంటే ననే షాక్ కి గురయ్యాను, అని ఆవేదన చెందాడు ఆ కుర్రాడు.
తాజాగా విడుదల అయిన ఆఫీసర్ ట్రైలర్ చూసిన ఆ యువకుడు ఆ ట్రైలర్ లోని ప్రతీ సన్నివేశం నేను రాసుకున్నవేనని ఆర్జీవీ అన్నీ కాపీ కొట్టాడని ఆయనకు ఎలాగైనా నాగార్జున సహాయం చేయాలని ఆ యువకుడు కోరాడు. టాలెంట్ ఉంది ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్న ఎంరో కొత్తవాళ్ళకు చాన్సులు ఇస్తున్న నాగార్జున గారు నన్ను కూడా ఒక్కసారి పట్టించుకోవాలని, దీనికి సంబందించిన అంశంపై నాగార్జునా గారు కల్పించుకోవాలని కోరాడు. ఇవన్నీ చూసి నాకు ఏమి చేయాలో అర్థం కాక మిమ్మల్ని ఎలా కలవాలో నాకు తెలియక బహిరంగంగా ఇలా ట్విట్టర్ లో మెసేజ్ చేస్తున్నందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండని, దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకీ న్యాయం చేయండి అని నాగార్జునని ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేసాడు యువకుడు.

  •  
  •  
  •  
  •  

Comments