చంద్రబాబుకు వర్మ కౌంటర్.. నిజాలనే చూపిస్తా!

Thursday, October 19th, 2017, 03:50:28 AM IST

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదాలను రేపుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఏ స్థాయిలో హిట్ అవుతుందో గాని ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమాపై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిపై కౌంటర్లు వేస్తున్నాడు. ముఖ్యంగా టీడీపీ నేతలు వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అంతే కాకుండా వర్మ వైసిపి నేత రాకేష్ రెడ్డి తో కలిసి సినిమాను తెరకెక్కించడం చూస్తుంటే ముందు ముందు ఎలాంటి పరిణాలమాలు చోటు చేసుకుంటాయి అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఒప్పుకోరు అని చెప్పాడు. అయితే ఆ కామెంట్స్ కి వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా కౌంటర్ వేశారు.

లక్ష్మి’స్ ఎన్టీఆర్,పై సీఎం చంద్రబాబు నాయుడు గారి కామెంట్ల పై నా కామెంట్లు :
లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను. చంద్రబాబు గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను. అని వర్మ కామెంట్స్ చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments