వర్మ ఎమోషనల్ సాంగ్ విన్నారా?

Tuesday, May 22nd, 2018, 06:05:59 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తరువాత నాగార్జున తో ఆఫీసర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లలో వర్మ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే నవ్వే నువ్వు అనే ఒక సాంగ్ ని రిలీజ్ చేశాడు. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ పాటను సెట్ చేశారు. యాక్షన్ కథాంశంతో పాటు తండ్రి కూతుళ్ల మధ్య ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా వర్మ సినిమాలో చూపించనున్నాడట. సిరా శ్రీ రాసిన ఆ పాటకు రవి శంకర్ మ్యూజిక్ అందించారు. ఇక ఆఫీసర్ సినిమా జూన్ 1న రిలీజ్ కానుంది. అసలైతే ఈ శుక్రవారమే సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్న వర్మ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల జూన్ 1కి వాయిదా వేసినట్లు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments