ఆఫీసర్ తేలిపోయింది.. రాజుగాడు ఫినిష్.. అభిమన్యుడోక్కడే!

Saturday, June 2nd, 2018, 02:04:39 PM IST

సమ్మర్ లో ఈ సారి టాలీవుడ్ బిజినెస్ బాగానే నడిచింది గాని ఎండింగ్ కు వచ్చేసరికి ఒక్కసారిగా డీలాపడిపోయింది. మొదటి రోజే వసూళ్లు దారుణంగా పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రామ్ చరణ్ రంగస్థలం నుంచి మొన్న వచ్చిన మహానటి వరకు అన్ని సినిమాలు మంచి లాభాలతో వసూళ్లను అందుకున్నాయి. ముఖ్యంగా మహానటి అయితే పబ్లిక్ టాక్ ను బట్టి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. భరత్ అనే నేను అయితే ఏ స్థాయిలో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే నిన్న రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ – ఆఫీసర్ అలాగే రాజు గాడు అయితే ఊహించని విధంగా దారుణమైన ఓపెనింగ్స్ అందుకున్నాయి. ముఖ్యంగా వర్మ ఈ సారి తన సినిమాతో సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తాడు అని మాట ఇచ్చాడు. ప్రమోషన్స్ లలో బజ్ కూడా చాలానే క్రియేట్ చేశాడు కానీ అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు. సినిమా మొదటి రోజు నైజం కలెక్షన్స్ నెట్ 28 లక్షలు రాగా 9 లక్షల షేర్స్ వచ్చాయి. ఎక్కువ బిజినెస్ ఉన్న నైజంలో ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం నాగార్జున కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్. 20 ఏళ్ల తరువాత సెట్ అయిన శివ కాంబో టాలీవుడ్ కి మళ్లీ కొత్త అర్ధాన్ని చెబుతుందని అనుకున్నా కనీసం అభిమానులను మెప్పించకపోవడం గమనార్హం.

ఇక రాజ్ తరుణ్ రాజుగాడు పరిస్థితి కూడా అదే తరహాలో ఉంది. నైజాంలో ఆ సినిమా 19 లక్షల గ్రాస్ మాత్రమే అందుకుంది అంటే షేర్స్ ఏ రూపంలో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. గత కొంత కాలంగా డిజాస్టర్స్ చూస్తున్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా పెద్దగా హెల్ప్ చేయలేకపోయింది. పైగా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయకపోవడం సినిమాకు మైనెస్ పాయింట్. విడుదలైన మూడు సినిమాల్లో ఎంతో కొంత అభిమన్యుడు బెటర్ అని చెప్పుకోవాలి. కోలీవుడ్ హీరో విశాల్ కి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంచెం ఆలస్యంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటికీ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. మొదటి రోజే అభిమన్యుడు నైజాంలో 69 లక్షల గ్రాస్ అందుకుంది.